Join Hands To Donate Blood



వేరొకరికి ప్రాణం పోసే అదృష్టం మనకి లేదు కానీ పోయే ప్రాణాన్ని కాపాడే అవకాశం,అదృష్టం  మనకి ఉన్నాయి. అదే రక్తదానం... ప్రాణదానం... దీని మీద చాలా మంది చాలా అపోహలున్నాయ్... దయచేసి అవన్నీ దూరం చేసుకోండి.

అవసరం :
ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది?
ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటె ఎక్కువ రక్త చందురం(hemoglobin) ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటె తక్కువ రక్తచందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే ఉరమరగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి (patient) శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించినవాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రోగి స్వంత రక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధి చేసి, తిరిగి వాడతారు.

కృత్రిమ రక్తం :
ఈ రోజుల్లో రక్త దానం చేస్తామని ముందుకొచ్చేవారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్త దానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇలా సరఫరా ఒక పక్క తగ్గిపోతూ ఉంటే మరొక పక్క నుండి వృద్ధుల జనాభా పెరుగుతోంది. రక్త దానం పుచ్చుకునే వారిలో ఎక్కవ భాగం వయ్సు మళ్ళిన వారే.కనుక రక్తానికి ఎద్దడి రోజులు వస్తున్నాయి. దీనికి తోడు రవాణా ఇబ్బందులు, నిల్వ చెయ్యటంలో ఇబ్బందులు వల్ల కృత్రిమంగా రక్తం తయారు చెయ్యాలనే కోరిక పెరిగింది. కృత్రిమంగా తయారు చేసిన రక్తం (artificial blood)ఈ దిగువ చూపిన లక్షణాలు కలిగి ఉండాలి. 

 రక్తం ఇవ్వాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన నిభందనలు:-  
  • అది అవిషి (non-toxic) అయి ఉండాలి.
  • అందులో రోగకారక పదార్ధాలు ఉండకూడదు.
  • రవాణా చెయ్యటానికి అనుకూలంగా ఉండాలి.
  • గ్రహీత శరీరంలోకి ఎక్కించినప్పుడు రక్షక ప్రతిస్పందన (immune reaction) రాకూడదు.
  • ఏ జాతి రక్తంతో అయినా కలసిపోగలగాలి.
  • అవసరం తీరేవరకూ (శరీరం తన సొంత రక్తాన్ని తయారు చేసుకునే వరకు) పాడవకుండా పని చెయ్యాలి.
  • అవసరం తీరిన తరువాత శరీరం నుండి విసర్జించబడాలి.
  • అలమారు లో చాల కాలం నిల్వ ఉంచినా పాడవకూడదు. (దీనినే అలమారు ఆయుర్దాయం లేదా shelf life అంటారు.)
ఈ కోరికలన్నింటినీ తీర్చటానికీ ఇంతవరకు అనుకూలమైన పదార్ధం దొరకలేదు. కనుక అర్ధం చేసుకోండి మిత్రులారా ... మనం సాధ్యమైన౦త వరకు  అపోహలని దూరం చేసుకోండి. రక్త దానానికి చేతులు కలపండి. మేమున్నాం అంటూ ముందుకు రండి.. రక్తదానం లో పాలుపంచుకోండి. నలుగురికీ సాయపడండి..మీరు చేయాల్సిందల్లా మీ వివరాలను అందచేయండి.